Mon Dec 23 2024 17:07:09 GMT+0000 (Coordinated Universal Time)
గుజరాత్ లో కాంగ్రెస్ కోసం ప్రశాంత్ కిషోర్?
గుజరాత్ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేయనున్నారని తెలిసింది.
ఈ ఏడాది చివరలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడంతో కాంగ్రెస్ ఈసారి ఎలాగైనా గుజరాత్ లో సత్తా చాటాలని భావిస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీని చివర వరకూ కాంగ్రెస్ టెన్షన్ పెట్టింది. దీంతో రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయ్యారని చెబుతున్నారు.
లోక్ సభ ఎన్నికల.....
కాంగ్రెస్ తో కొంత దూరంగా ఉన్న ప్రశాంత్ కిషోర్ గుజరాత్ ఎన్నికల కోసం దగ్గరవుతున్నారు. గుజరాత్ ఎన్నికల కోసం ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ కు వ్యూహకర్తగా పనిచేయనున్నారని తెలిసింది. రాహుల్, ప్రశాంత్ కిషోర్ ఇద్దరి లక్ష్యం ఒక్కటే. గుజరాత్ లో బీజేపీని దెబ్బకొడితే లోక్ సభ ఎన్నికల్లో కొంత పై చేయి సాధించవచ్చన్నది ఇద్దరి వ్యూహంగా ఉంది. మరి పీకే కాంగ్రెస్ కోసం పనిచేస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story