Sun Jan 05 2025 03:16:59 GMT+0000 (Coordinated Universal Time)
బెంగళూరులో భయం.. భయంగా
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా బెంగళూరులో వరద తీవ్రత ఎక్కువగా ఉంది.
కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా బెంగళూరులో వరద తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయల నష్టం జరిగినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. అత్యవసర చర్యల కోసం ప్రభుత్వం రూ.300 కోట్ల ను విడుదల చేసింది. ప్రధానంగా ఐటీ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. వాహనాలు కదలలేని పరిస్థితి. దీంతో కొందరు ఐటీ ఉద్యోగులు ట్రాక్టర్లలో విధులకు బయలు దేరడం విశేషం.
భారీ వర్షాలతో..
భారీ వర్షాలతో అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతను అమలు చేస్తున్నారు. శనివారం నుంచి ప్రారంభమయిన ఈ వర్షాలు కురుస్తూనే ఉండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగులు విధులకు హాజరు కావడానికి కూడా వీలు లేకుండా ఉంది. పబ్లిక్ ట్రాన్స్ పోర్టు సిస్టమ్ కూడా సరిగా పనిచేయడం లేదు. యెమలూరు ప్రాంతం పూర్తిగా జలమయంగా మారింది. ఉద్యోగులు తమ వాహనాలను వదిలిపెట్టి ట్రాక్టర్లను ఆశ్రయిస్తున్నారు. ట్రాఫిక్ గంటల తరబడి కూడళ్లలో నిలిచిపోతుంది. మంచినీటి సరఫరా అనేక ప్రాంతాల్లో నిలిచి పోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది తొలగించే పనిని చేపట్టారు.
Next Story