Mon Apr 21 2025 00:35:46 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : తమిళనాడులో భారీ వర్షాలు.. ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను అధికారులు ప్రకటించారు

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఐదు జిల్లాలకు రెడ్ అలెర్ట్ ను అధికారులు ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అపప్రమత్తం చేశారు. కొన్ని జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరో నలభై ఎనిమిది గంటల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. పది జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు.
జతపాతాల వద్దకు...
ఇప్పటికే అనేక జిల్లాలు భారీ వర్షాలతో నీటీతో తడసి ముద్దయిపోయాయి. సబ్ వేలన్నీ నీరు నిండిపోయాయి. తంజూవూరు, తిరువారూర్ వంటి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక తేని జిల్లాలో ప్రమాదకరంగా జలపాతాలు ప్రవహిస్తున్నాయి. సందర్శకులను ఎవరినీ అనుమతించడం లేదని, ఎవరూ అటు వెళ్లవద్దని హెచ్చరించారు.
Next Story