Fri Mar 28 2025 05:11:58 GMT+0000 (Coordinated Universal Time)
Tamilnadu : తమిళనాడులో కుండపోత వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక జిల్లాల్లో వర్షాలు భారీగా పడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడం, భారీ వర్షాలు కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్థం స్థంభించిపోయింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.
పది జిల్లాల్లో...
తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారితో పాటు పది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ను వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. నీలగిరి జిల్లాలో పలు ప్రాంతాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని అధికారులు తెలిపారు. మదురై, తేని, ఈరోడ్ జిల్లాల్లో భారీ వర్షాలుప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక జారీ చేశారు.
Next Story