Tue Dec 24 2024 18:00:06 GMT+0000 (Coordinated Universal Time)
14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్
భారత ఉప రాష్ట్రపతిగా జగదీప్ థన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు
భారత ఉప రాష్ట్రపతిగా జగదీప్ థన్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భారత 14వ ఉప రాష్ట్రపతిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. 1989లో లోక్సభకు ఎన్నికయ్యారు. 1991 లో పీవీ నరసింహారావు హాయంలో ఆయన మంత్రిగా పనిచేశారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా పనిచేసిన ధన్కర్ అంతకు ముందు రాజస్థాన్ హైకోర్టులో న్యాయవాదిగానూ పనిచేశారు.
సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చేత...
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ చేత కూడా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కూడా హాజరయ్యారు. నూతన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కు పలువురు అభినందనలు తెలిపారు.
Next Story