Mon Dec 23 2024 02:37:30 GMT+0000 (Coordinated Universal Time)
ముగ్గురు పాకిస్తానీ తీవ్రవాదుల కాల్చివేత
ఉత్తర కశ్మీర్‌లోని క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఒక పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు. లోయ అంతటా భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో
జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో జైష్-ఎ-మహ్మద్ (జెఇఎమ్) ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారని పోలీసులు తెలిపారు. ఉత్తర కశ్మీర్‌లోని క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద జరిగిన ఎన్కౌంటర్లో ఒక పోలీసు కూడా ప్రాణాలు కోల్పోయాడు. లోయ అంతటా భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులలో ఒకచోట ఎన్కౌంటర్ జరిగిందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.
"ఈరోజు (బుధవారం) కశ్మీర్ అంతటా నాకాలు నిర్వహించారు. క్రీరీ ప్రాంతంలోని నజీభట్ క్రాసింగ్ వద్ద ఉగ్రవాదులతో) ఎన్కౌంటర్ జరిగింది. ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు హతమయ్యారు," అని IGP విలేకరులతో అన్నారు. ఈ ఎన్కౌంటర్లో ఒక పోలీసు కూడా మరణించాడని చెప్పారు. పోలీసు బలగాల్లో ఒకరిని కోల్పోవడం బాధాకరమని, అయితే ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చడం చాలా పెద్ద విజయమని విజయ్ కుమార్ అన్నారు. ముగ్గురు ఉగ్రవాదులు శ్రీనగర్‌కు వచ్చి ఏదైనా పెద్ద దాడి చేసి ఉండవచ్చని విజయ్ కుమార్ అన్నారు. గత మూడు నాలుగు నెలలుగా గుల్మార్గ్లోని కొండ ప్రాంతాలలో ఉగ్రవాదులు చురుకుగా ఉన్నారని ఐజీపీ తెలిపారు. మేము వారిని క్రమం తప్పకుండా ట్రాక్ చేస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు, భద్రతా దళాలతో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 22 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతమయ్యారు.
పాక్ ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు మరిన్ని ప్రయత్నాలు జరుగుతాయని కుమార్ తెలిపారు. నగరంలోని సౌరా ప్రాంతంలో మంగళవారం జరిగిన దాడిలో ఒక పోలీసు మరణించడం, అతని కుమార్తె గాయపడిన ఘటన వెనుక లష్కరే తోయిబా (ఎల్ఇటి)కి చెందిన ఇద్దరు స్థానిక ఉగ్రవాదులను గుర్తించినట్లు ఐజిపి చెప్పారు. "TRF/LeTకి చెందిన స్థానిక కమాండర్ గాండెర్బల్కు చెందిన ఆదిల్, కొత్తగా రిక్రూట్ అయిన మరొక ఉగ్రవాది ఈ హత్య వెనుక ఉన్నారు. మేము వారిని త్వరలో పట్టుకుంటాము" అని ఆయన చెప్పారు. హత్యకు గురైన పోలీసు కుమార్తె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.. ఆమె పరిస్థితి నిలకడగా ఉంది.
News Summary - 3 Pakistani terrorists killed in encounter in Baramulla district
Next Story