Mon Dec 23 2024 12:10:09 GMT+0000 (Coordinated Universal Time)
ఇండో - పాక్ సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం
పంజాబ్ గురుదాస్ పుర్ లోని చందూ వదాలా పోస్ట్ వద్ద పాక్ స్మగ్లర్లపై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. వెంటనే స్మగ్లర్లు
ఇండో - పాక్ సరిహద్దు వద్ద పాక్ దుశ్చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అనవసరంగా రెచ్చగొట్టొద్దని ఎన్నిసార్లు హెచ్చరించినా.. పాక్ తన వక్రబుద్ధిని ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంది. ఉగ్రమూకల డ్రోన్లపై గురిపెట్టిన భారత భద్రతాదళాలు..సరిహద్దు వెంట డ్రగ్స్ సరఫరాపైనా నిఘా ఉంచారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 5.15 గంటల ప్రాంతంలో భారత్ లోకి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న పాక్ ముఠాను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు.
Also Read : ఫిబ్రవరి 15 వరకూ పాఠశాలలు మూసివేత
పంజాబ్ గురుదాస్ పుర్ లోని చందూ వదాలా పోస్ట్ వద్ద పాక్ స్మగ్లర్లపై బీఎస్ఎఫ్ జవాన్లు కాల్పులు జరిపారు. వెంటనే స్మగ్లర్లు ఎదురు కాల్పులు చేయడంతో.. భద్రతా దళాలు ఆ ముఠాను తరిమికొట్టారు. ఈ ఎదురుకాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ జవానుకు గాయాలైనట్లు బీఎస్ఎఫ్ డీఐజీ వెల్లడించారు. స్మగ్లర్ల నుంచి 47 కేజీల హెరాయిన్తో పాటు.. 7 ప్యాకెట్ల నల్లమందు, 2 మ్యాగజైన్లు ఉన్న చైనీస్ పిస్టల్, ఏకే 47 తుపాకులు, పిస్టళ్లు సహా ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు భద్రతా సిబ్బంది.
Next Story