Thu Apr 03 2025 11:24:58 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : కుమారస్వామి వెనుకంజ
జేడీఎస్ అధినేత కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. చెన్నపట్టణ నుంచి ఆయన పోటీ చేశారు.

జేడీఎస్ అధినేత కుమారస్వామి వెనుకంజలో ఉన్నారు. ప్రస్తుతం వస్తున్న ఫలితాల ప్రకారం ఆయన అతి తక్కువ ఓట్ల ఆధిక్యతతో వెనుకంజలో ఉన్నారు. కుమారస్వామి చెన్నపట్టణ నుంచి పోటీ చేశారు. అయితే పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, బీజేపీ నుంచి కాంగ్రస్‌లో చేరిన జగదీష్ షట్టర్ మాత్రం ముందంజలో ఉన్నారు.
జేడీఎస్ కూడా...
అలాగే సిద్ధరామయ్య కూడా ముందంజలో ఉన్నారు. ఎర్లీ ట్రెండ్స్‌ను పరిశీలిస్తే జనతాదళ్ ఎస్ పెద్దగా ప్రభావం చూపే అవకాశం కనిపించడం లేదు. జేడీఎస్ కార్యాలయంలో కూడా సందడి కూడా లేదు. నేతలు,కార్యకర్తలు అక్కడకు ఎవరూ చేరుకోలేదు. దీంతో హంగ్ అసెంబ్లీ ఏర్పాటవుతుందన్న ఆశలు జేడీఎస్ నేతల్లో గల్లంతవుతున్నాయి.
- Tags
- kumaraswamy
- jds
Next Story