Thu Dec 19 2024 12:03:58 GMT+0000 (Coordinated Universal Time)
షాతో కుమారస్వామి భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జేడీఎస్ నేత కుమారస్వామి భేటీ అయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితం అమిత్ షా ఇంటికి వెళ్లి కలిశారు
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జేడీఎస్ నేత కుమారస్వామి భేటీ అయ్యారు. ఆయన కొద్దిసేపటి క్రితం అమిత్ షా ఇంటికి వెళ్లి కలిశారు. రాజకీయ అంశాలపై చర్చించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ కలసి పోటీ చేసే అంశంపై ఇరువురు చర్చించారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ను దెబ్బకొట్టాలంటే రెండు పార్టీలు కలసి పోటీ చేయడమే మంచిదన్న అభిప్రాయం కుమారస్వామి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్డీఏలో జేడీఎస్ చేరుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీని జేడీఎస్ అధినేత దేవెగౌడ కలసి మాట్లాడారు.
ఎన్డీఏలో చేరుతున్నట్లు...
శాసనసభ ఎన్నికల్లో చావు దెబ్బ తిన్న జేడీఎస్ జట్టు కోసం ప్రయత్నిస్తుంది. అధికారాన్ని కోల్పోయిన బీజేపీ కూడా జేడీఎస్తో పొత్తుకు ముందుకు వచ్చింది. దీంతో లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది. అంతకు ముందు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలసిన జేడీఎస్ నేతలు తాము ఎన్డీఏలో చేరుతున్నట్లు ప్రకటించారు. దీంతో వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలసి పోటీ చేసేందుకు రెడీ అవుతున్నాయి.
Next Story