Thu Dec 19 2024 12:44:12 GMT+0000 (Coordinated Universal Time)
JDS : పోలీసుల అదుపులో ప్రజ్వల్ రేవణ్ణ.. ఎయిర్పోర్టులో అడుగుపెట్టిన వెంటనే
జేడీఎస్ పార్లమెంటు సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
జేడీఎస్ పార్లమెంటు సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న అర్థరాత్రి దాటిన తర్వాత ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్ట్ చేశారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణపై కేసు నమోదయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని రోజులుగా ప్రజ్వల్ రేవణ్ణ విదేశాల్లో తలదాచుకుంటున్నారు. అయితే తాత, మాజీ ప్రధాని దేవెగౌడ పోలీసుల ఎదుట లొంగిపోవాలని గట్టిగా కోరడంతో ప్రజ్వల్ రేవణ్ణ అర్థరాత్రి బెంగళూరు ఎయిర్పోర్టులో దిగారు.
లైంగిక వేధింపుల కేసు...
అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ అయినా విదేశాలకు పారిపోయారు. అయితే తాత దేవెగౌడ తీవ్రమైన స్వరంతో చెప్పడంతో ఆయన తాను లొంగిపోతానని చెప్పారు. చెప్పిన ప్రకారమే నిన్న అర్ధరాత్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రజ్వల్ రేవణ్ణ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆయనపై రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఆయనను నేడు కోర్టులో హాజరుపర్చే అవకాశముంది. ప్రజ్వల్ రేవణ్ణ ఇటీవల జరిగిన ఎన్నికల్లో జేడీఎస్ నుంచి హసన్ నియోజకవర్గంలో పోటీ చేశారు.
Next Story