Thu Dec 19 2024 18:05:58 GMT+0000 (Coordinated Universal Time)
జేఈఈ మెయిన్ పరీక్షలు వాయిదా
జేఈఈ మెయన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు
జేఈఈ మెయన్ పరీక్షలు వాయిదా పడ్డాయి. రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. మెయిన్ పరీక్షలు తిరిగి ఈ నెల 25వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని అధికారులు చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 21వ తేదీన జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమై ఈ నెల 30వ తేదీతో ముగియాల్సి ఉంది. అయితే రేపటి నుంచి జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి.
కారణాలు మాత్రం...
వాయిదాకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ నెల 25వ తేదీ నుంచి జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమవుతాయని మాత్రం చెప్పారు. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. 517 కేంద్రాల్లో జరుగనున్న ఈ పరీక్షలకు 6.29 లక్షల మంది హాజరుకానున్నారని తెలిపింది. రేపటి నుంచి హాల్ టిక్కెట్లు వెబ్ సైట్ లో ఉంటాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించింది.
Next Story