Mon Dec 23 2024 19:52:48 GMT+0000 (Coordinated Universal Time)
జేఈఈ మెయిన్స్ మళ్లీ వాయిదా
జేఈఈ మెయిన్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ నెలలో జరగాల్సిన పరీక్షను జూన్ నెలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు
జేఈఈ మెయిన్ పరీక్ష మరోసారి వాయిదా పడింది. ఈ నెలలో జరగాల్సిన పరీక్షను జూన్ నెలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐఐటీ, ఎస్ఐటీ, ఐఐఐటీ తదితర విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తూ వస్తున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఈ ఏడాది కూడా అదే వాయిదాల పర్వం కొనసాగుతుంది.
రాష్ట్రాల నుంచి....
సీబీఎస్ఈ తో పాటు పలు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ఉండటంతో జేఈఈ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అనేక రాష్ట్రాల నుంచి విజ్ఞప్తులు అందాయి. దీనిని పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ లో జరగాల్సిన జేఈఈ మెయిన్స్ మొదటి విడత పరీక్ష జూన్ 20 వతేదీ నుంచి 29వ తేదీ వరకూ నిర్వహిస్తారు. మేలో జరగాల్సిన రెండో విడత జేఈఈ మెయిన్స్ ను జులూై 21 నుంచి 30 వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.
Next Story