Sun Dec 22 2024 16:09:08 GMT+0000 (Coordinated Universal Time)
BJP : జార్ఖండ్ లో బీజేపీ మ్యానిఫేస్టో ఇదే.. నాలుగు గ్యారంటీలు
జార్ఖండ్ బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేశారు.
జార్ఖండ్ బీజేపీ మేనిఫెస్టోను కేంద్ర మంత్రి అమిత్ షా విడుదల చేశారు. మొత్తం నాలుగు గ్యారంటీలను అమిత్ షా ఇచ్చారు. ఉమ్మడి పౌరస్మృతిని అమలులోకి తెస్తామని తెలిపారు. ఇక ఇచ్చిన నాలుగు గ్యారంటీలు ఇలా ఉన్నాయి.గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే అందచేస్తామని తెలిపారు. ఐదు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మహిళలకు ప్రతి నెల 2,100 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు.
చొరబాటు దారులను...
రెండు సంవత్సరాల వరకు అండర్ గ్రాడ్యుయేట్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు ప్రతి నెల రెండు వేల రూపాయలు ఇస్తామని పార్టీ హామీ ఇచ్చిన అమిత్ షా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయలేక చేతులెత్తేసిందని, అది తప్పు ఒప్పుకోవడం ఒకింత సంతోషమని అన్నారరు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో అవినీతి రాజ్యమేలిందన్న ఆయన అనేక మంది రాష్ట్రంలోకి చొరబాటుదారులు ప్రవేశించారన్నారు. చొరబాటుదారులు ఇక్కడి భూమిని ఆక్రమించుకున్నారని అమిత్ షా ఆరోపించారు. అందువల్లనే తాము దీనికి అడ్డుకట్ట వేస్తామని అమిత్ షా తెలిపారు. ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకు వస్తామని చెప్పారు.
Next Story