Tue Nov 05 2024 03:41:11 GMT+0000 (Coordinated Universal Time)
తొమ్మిది నెలల పాపలో బర్డ్ ఫ్లూ
మనుషులకు బర్డ్ ఫ్లూ చాలా అరుదుగా సోకుతూ ఉంటుంది.
మనుషులకు బర్డ్ ఫ్లూ చాలా అరుదుగా సోకుతూ ఉంటుంది. అయితే ఇది అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. జార్ఖండ్ రాష్ట్రంలో తొమ్మిది నెలల పాపలో బర్డ్ ఫ్లూ సోకడం కలకలం రేపింది. రామ్గఢ్ జిల్లాకు చెందిన శిశువును జ్వరం, దగ్గు మరియు శ్వాసకోశ సమస్యల లక్షణాలతో రిమ్స్లో చేర్పించారు. శిశువుకు సంబంధించిన కొన్ని శాంపుల్స్.. జెనెటిక్స్, జెనోమిక్స్ విభాగానికి పంపారు. ఇది బర్డ్ ఫ్లూగా నిర్ధారించారని పీడియాట్రిక్స్ విభాగానికి చెందిన డాక్టర్ రాజీవ్ మిశ్రా తెలిపారు. ‘‘ఆసుపత్రిలో ఏడాదిలో ఇదే తొలి బర్డ్ ఫ్లూ కేసు. శిశువు ప్రత్యేక యూనిట్లో చికిత్స పొందుతోంది, ” అని డాక్టర్ రాజీవ్ మిశ్రా చెప్పారు. కోవిడ్-19 వంటి జాగ్రత్తలు తీసుకున్నామని, శిశువు ఇతరుల నుండి వేరుగా ఉందని మిశ్రా చెప్పారు. పాపకు ఎలా సోకిందా అని ఆరాతీస్తున్నారు అధికారులు.
బర్డ్ ఫ్లూ వైరస్ మనుషులకు సులభంగా సోకుతుందని UN ఏజెన్సీలు ఇప్పటికే హెచ్చరించాయి. బర్డ్ ఫ్లూ నివారణకు అన్ని నిబంధనలను పాటించాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలకు సూచించింది. బర్డ్ ఫ్లూను ఏవియన్ ఇన్ఫ్లుఎంజా అని కూడా పిలుస్తారు. బర్డ్ ఫ్లూ కారణంగా పక్షులు పెద్ద ఎత్తున చనిపోతున్నాయని WHO తెలిపింది. మనుషుల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ కేసులు చాలా తక్కువే.. ఈ వైరస్ పక్షుల నుండి మానవులకు వ్యాపిస్తుంది.. కానీ మానవుని నుండి మానవునికి వ్యాప్తించడం చాలా కష్టమే..! భయపడాల్సిన అవసరం లేదు. ఈ వైరస్ కోవిడ్ లేదా మరే ఇతర ప్రమాదకరమైన వైరస్ లాగా అంటువ్యాధిగా మారదని నిపుణులు చెబుతున్నారు. బర్డ్ ఫ్లూను నివారించడానికి ఎలాంటి మందులు లేవు. జబ్బుపడిన పక్షి దగ్గరికి వెళ్లకపోవడమే మంచిది.
Next Story