Mon Dec 23 2024 03:59:11 GMT+0000 (Coordinated Universal Time)
జియోకు ఆరేళ్లు పూర్తి.. 5G సేవలకు సిద్ధం
జయో ఆవిర్భవించి ఆరో ఏడాది పూర్తయింది. 5జి లాంచ్ తర్వాత డేటా వినియోగం మరో రెండు పెరుగుతుందని అంచనా వేస్తుంది
జయో ఆవిర్భవించి ఆరో ఏడాది పూర్తయింది. 5జి లాంచ్ తర్వాత డేటా వినియోగం మరో రెండు పెరుగుతుందని అంచనా వేస్తుంది. బ్రాడ్ బ్యాండ్ చందాదారులు 4x తో పాటు ఇంటర్నెట్ వేగం 5x కంటే ఎక్కువ పెరిగింది. డేటా ధరలు 95 శాతం తగ్గాయని జియో కంపెనీ పేర్కొంది. ఈ ఆరేళ్లలో టెలికా పరిశ్రమలో నెలకు సగటు తలసరిడేటా వినియోగం వంద రెట్లు ఎక్కువ పెరిగిందని తెలిపింది. తాజాగా నెలకు ఒక్క వినియోగదారుడు 15.8 GB స్థాయికి చేరుకుంది. ప్రతి నెల వినియోగదారులు 20 GB డేటాను ఉపయోగిస్తున్నారని పేర్కొంది.
వచ్చే దీపావళికి...
వచ్చే దీపావళికి జియో 5G ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ విషయాన్ని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ప్రకటించారు. 5G సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత డేటా వినియోగం మరింత పెరిగే అవకాశముంది. వచ్చే మూడేళ్లలో డేటా వినియోగం రెండు రెట్లు ఎక్కువగా పెరుగుతందని ఎరిక్సన్ మొబిలిటీ రిపోర్టు వెల్లడించింది. దీంతో డేటాకు మరింత డిమాండ్ పెరిగే అవకాశముంటుంది. 5Gకి సంబంధించిన పెద్ద ప్లాన్లు కూడా త్వరలో రానున్నాయని ఆ సంస్థ తెలిపింది. అతి తక్కువ కాలంలోనే జియో ప్రపంచంలోనే అతి పెద్ద టెలికాం కంపెనీలుగా అవతరించింది.
అతి పెద్ద వాటాను...
దేశంలో ఇప్పుడు జియో కస్టమర్లతో 36 శాతం వాటాను చేజిక్కించుకుంది. రాబోయే కాలంలో జియో మరో డిజిటల్ విప్లవానికి సిద్ధమవుతుంది. ప్రస్తుతం ఆదాయపరంగా జియో మార్కెట్ వాటా 40.3 శాతం. గత ఆరేళ్లలో కస్టమర్లకు ఉచిత కాలింగ్, మొబైల్ వినియోగ ఖర్చులను తగ్గించినట్లు పేర్కొంది. మొబైల్ వినియోగాన్ని జియో సులభతరం చేసింది. ప్రస్తుతం జియో పదమూడు రూపాయలకే 1 GB డేటాను అందిస్తుంది. భారతీయ డిజిటల్ వ్యవస్థకు జియో వెన్నుముకగా నిలుస్తుందని ఆ కంపెనీ యాజమాన్యం అభిప్రాయపడింది. ఈరోజు యూపీఐ లావాదేవీలు 10.72 లక్షల కోట్లు చేరుకున్నాయంటే దాని వెనక జియో ప్రమేయం ఉందని తెలిపింది.
జీవితాన్ని సులభతరం...
మొదటి 4G జియో స్మార్ట్ ఫోన్ ను ప్రవేశపెట్టిన తర్వాత వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధానమైన రెండు సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొంది. ఖరీదైన ఫోన్లు కొనుగోలు చేయకుండా నివారించగలిగింది. లాక్డౌన్ సమయంలోనూ జియో కారణంగా ఫైబర్ సేవలు వినియోగదారులకు అండగా నిలిచాయని తెలిపింది. ప్రధానంగా ఇ షాపింగ్ కోసం జియో సేవలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. విద్యార్థులు ఇంటి నుంచే పాఠాలు వినేందుకు జియో సేవలు ఉపయోగపడుతున్నాయి. 70 లక్షల క్యాంపస్ లు జియో ఫైబర్ కు కనెక్ట్ అయ్యాయి. వర్క్ ఫ్రం హోం సక్సెస్ కావడానికి కూడా జియో సేవలే కారణమని చెబుతున్నాయి. జియో ఫైబర్ జీవితాలను సులభతరం చేసింది.
Next Story