Mon Dec 23 2024 12:36:51 GMT+0000 (Coordinated Universal Time)
అన్నింటా జియోనే టాప్... ట్రాయ్ వెల్లడి
ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ను వెనక్కు నెట్టి జియో దేశంలో ప్రధమ స్థానంలో నిలిచింది.
అతి పెద్ద ఫిక్స్డ్ లైన్ టెలికాం కంపెనీగా జియో ఆవిర్భవించింది. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ ను వెనక్కు నెట్టి జియో దేశంలో ప్రధమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు ట్రాయ్ విడుదల చేసిన గణాంకాలు తెలియజేస్తున్నాయి. మూడేళ్లలోనే జియో ఈ ఘనతను సాధించింది. ట్రాయ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఫిక్స్డ్ లైన్ బ్రాడ్ బాండ్ జియో ఫైబర్ వినియోగదారుల సంఖ్య 73.52 లక్షలకు చేరింది. బీఎస్ఎన్ఎల్ యూజర్లు 71.32 లక్షలు మాత్రమే ఉన్నారు. ఎయిర్టెల్ 61.9 లక్షల మంది వినియోగదారులతో మూడో స్థానంలో ఉంది.
మొబైల్ వినియోగదారుల్లోనూ....
ఈ విభాగంలో బీఎస్ఎన్ఎల్ 15,734 మంది వినియోగదారులను కోల్పోయిందని ట్రాయ్ తెలిపింది. జియోకు 2.62 లక్షల మంది, ఎయిర్ టెల్ కు 1,19 లక్షల మంది, ఐడియాకు 4,202, టాటా టెలిసర్వీసెస్ కు 3,679 మంది వినియోగదారులు కొత్తగా చేరారని ట్రాయ్ పేర్కొంది. బ్రాండ్ బ్యాండ్ కనెక్షన్లు 80.74 కోట్ల నుంచి 82.39 కోట్లకు చేరాయి. ఇక మొబైల్ నెట్ వర్క్ లోనూ జియో అగ్రస్థానంలోనే నిలిచింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో జియోకు కొత్తగా 32.8 లక్షల మంది వినియోగదారులు చేరడంతో 41.92 కోట్లతో ప్రధమ స్థానాన్ని దక్కించుకుంది.
Next Story