Sat Dec 28 2024 06:45:27 GMT+0000 (Coordinated Universal Time)
ప్రముఖ జర్నలిస్ట్ రానా అయూబ్ ఫోన్ నెంబర్ లీక్
రానా అయూబ్ ఫోన్ నెంబర్
ప్రముఖ భారతీయ పాత్రికేయురాలు, రచయిత్రి, రానా అయ్యూబ్ ఫోన్ నెంబర్ సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆమె ఫోన్ నంబర్ లీక్ అవ్వడంతో తీవ్ర వేధింపులను ఎదుర్కొంది. 2002 గుజరాత్ అల్లర్లను పరిశోధించిన తన పుస్తకం “గుజరాత్ ఫైల్స్: అనాటమీ ఆఫ్ ఏ కవర్-అప్” ద్వారా గుర్తింపు పొందిన అయ్యూబ్, తన వ్యక్తిగత డేటా, ఫోన్ నంబర్ లీక్ కావడం వల్ల ఎదురైన చిక్కుల కారణంగా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
తనకు ప్రాణహాని, అత్యాచారం బెదిరింపులు వచ్చాయని.. చివరికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్లు అయూబ్ తెలిపారు. ఈ ఘటన కారణంగా తన కుటుంబం భయాందోళనకు గురైందని, కుటుంబ సభ్యులు నిద్రలేని రాత్రులు గడిపారని బాధను వ్యక్తం చేశారు. X లో ముంబై పోలీసులను ట్యాగ్ చేస్తూ రాత్రి సుమారు 1 గంటలకు రైట్-వింగ్ హ్యాండిల్ ట్విట్టర్లో నా నంబర్‌ను పోస్ట్ చేసింది, ఫాలోవర్స్ ను టెక్స్ట్ చేయమని కోరింది. రాత్రంతా నా ఫోన్ మోగడం ఆగలేదు. వీడియో కాల్స్, అసభ్యకరమైన వాట్సప్ సందేశాలు వచ్చాయని తెలిపింది.
Next Story