Sat Nov 23 2024 07:49:19 GMT+0000 (Coordinated Universal Time)
గోల్డ్ రేట్.. స్వల్పంగా తగ్గింది
నిన్న ధర పెరిగితే.. నేడు స్వల్పంగా తగ్గింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.400..
బంగారం ధర స్థిరంగా ఉండదని అందరికీ తెలిసిన విషయమే. ఒకరోజు తగ్గితే.. మరోరోజు పెరుగుతుంది. ఒక్కోసారి స్థిరంగా కొనసాగుతుంటుంది. వరుసగా రెండ్రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం.. మూడురోజులు స్థిరంగా కొనసాగింది. నిన్న ధర పెరిగితే.. నేడు స్వల్పంగా తగ్గింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.400 తగ్గింది. కొద్దిరోజుల క్రితం రూ.62 వేలకు చేరిన 10 గ్రాముల బంగారం .. ఇప్పుడు రూ.60,760గా ఉంది.
తాజాగా తగ్గిన బంగారం ధరలతో తెలుగు రాష్ట్రాల్లో, ఇతర ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తదితర ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,760 కి తగ్గింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 55,850 గా ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,930గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,750గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,710 గా ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా తగ్గింది. చెన్నైలో కిలో వెండి ధర రూ.77,600 ఉండగా, ముంబై, ఢిల్లీలలో రూ.72,800, బెంగళూరు, హైదరాబాద్, విశాఖ, విజయవాడ నగరాల్లో రూ.77,600 ఉంది.
Next Story