Sun Apr 13 2025 02:43:29 GMT+0000 (Coordinated Universal Time)
గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్ రేట్స్
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 కు

నిన్న 10 గ్రాముల బంగారం పై రూ.300 పై చిలుకు ధర పెరగ్గా.. నేడు బంగారం ధర భారీగా తగ్గింది. ఆదివారం ఉదయం 6 గంటల వరకూ ఉన్న ధరల వివరాల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.700, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.770 మేర ధర తగ్గింది. వెండి కూడా బంగారం మాదిరిగానే స్వల్పంగా ధర తగ్గింది. కిలో వెండిపై రూ.800 తగ్గింది.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300 కు తగ్గింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,330కు దిగొచ్చింది. ముంబై, కోల్ కతా నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,330 గా ఉంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాలతో పాటు చెన్నై, కేరళ లలో కిలో వెండి ధర రూ.77,800 ఉంది.
Next Story