Sun Apr 06 2025 22:48:07 GMT+0000 (Coordinated Universal Time)
గోల్డ్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ధర తగ్గింది
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర

కొద్దిరోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. వరుసగా మూడురోజులు స్థిరంగా ఉన్న బంగారం ధరలు నేడు స్వల్పంగా తగ్గాయి. బంగారం కొనుగోలు దారులకు ఇదే మంచి సమయం. 10 గ్రాముల బంగారం పై రూ.400 నుండి 430 వరకూ ధర తగ్గింది. తగ్గిన ధరలతో నేడు దేశంలోని ప్రధాన నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. ఈ ధరలు శుక్రవారం ఉదయం 6 గంటల వరకూ నమోదైనవి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖ, తిరుపతి నగరాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,200 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,220 వద్ద కొనసాగుతోంది. ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కతా నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,350గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,370గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,650 కి తగ్గగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,220 కి తగ్గింది.
వెండి ధరలు ఇలా..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,400 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్కతా నగరాల్లో ఇదే ధర పలుకుతోంది. చెన్నై, కేరళలో కిలో వెండి ధర రూ. 77,700గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.77,700 వద్ద కొనసాగుతోంది.
Next Story