Mon Dec 23 2024 10:39:39 GMT+0000 (Coordinated Universal Time)
Nagapur : ఓటు హక్కు వినియోగించుకున్న పొట్టి మహిళ
లోక్ సభ ఎన్నికల్లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి ఆమ్టే నాగపూర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
లోక్ సభ ఎన్నికల్లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈరోజు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమయింది. 102 పార్లమెంటు స్థానాల్లో, 21 రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయింది. తమిళనాడు వంటి చోట ఎండ వేడిమికి పోలింగ్ శాతం కొంత తక్కువగా ఉంది. అయితే మహారాష్ట్రలోని నాగపూర్ లో ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళ జ్యోతి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
కుటుంబ సభ్యులతో కలసి ...
తన కుటుంబ సభ్యులతో కలసి పోలింగ్ కేంద్రానికి వచ్చి జ్యోతి క్యూలో నిల్చుని మరీ ఓటేశారు. జ్యోతి ఆమ్టే ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఎవరైనా తమ ఓటును వినియోగించుకోవాలని ఆమె పిలుపు నిచ్చారు.
Next Story