Mon Dec 23 2024 03:04:37 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమాదంలో గాయపడిన కచ్చాబాదమ్ సింగర్
పశ్చిమ బెంగాల్ లోని బీర్బూమ్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. భుబన్ ఇటీవలే ఒక సెకండ్ హ్యాండ్ కారును..
బీర్భూమ్ : కచ్చా బాదమ్.. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న పాట ఇది. ఒక్కపాటతో భుబన్ బద్యాకర్ అనే వ్యక్తి రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోయాడు. కచ్చా బాదమ్ పాట పాడిన అతను.. నిన్న పశ్చిమ బెంగాల్ లోని బీర్బూమ్ లో జరిగిన ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. భుబన్ ఇటీవలే ఒక సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. దానిలో డ్రైవింగ్ నేర్చుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో భుబన్ ఛాతీ భాగంలో స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను సూరి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
బీర్భూమ్ జిల్లాలో పల్లీలు అమ్ముకుంటూ.. కుటుంబాన్ని పోషించుకునే భుబన్.. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కచ్చా బాదమ్ పాట పాడేవాడు. ఒక కొనుగోలుదారుడు అతని పాటకు ఆకర్షితుడై.. దానిని రీమిక్స్ చేసి యూట్యూబ్ లో అప్ చేయగా.. 50 మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. అలా భుబన్ బద్యాకర్ ఓవర్ నైట్ స్టార్ అయ్యాడు. ఈ పాటతో పేరు, ప్రఖ్యాతులు రావడంతో ఇకపై పల్లీలు అమ్మబోనని భుబన్ తెలిపాడు. భుబన్ బద్యాకర్ ను ఇటీవలే పశ్చిమ బెంగాల్ పోలీసులు సత్కరించారు.
Next Story