Thu Dec 19 2024 19:07:54 GMT+0000 (Coordinated Universal Time)
మే 10న కర్ణాటక ఎన్నికలు
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయింది. మే పదో తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మే 13వ తేదీన కౌంటింగ్ ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 13న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. నాటి నుంచే నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. కర్ణాటకలో మొత్తం 5.21 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుందని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు.
ఒకే విడతలో....
ఎనభైఏళ్ల పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటు వేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఒకే విడతలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరపనున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. నామినేషన్లకు చివరి తేదీ ఏప్రిల్ 20వ తేదీగా నిర్ణయించారు. నామినేషన్లను ఏప్రిల్ 24వ తేదీలోగా ఉపసంహరించుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈరోజు నుంచే కర్ణాటకలో ఎన్నికలకోడ్ అమలులోకి రానుంది.
Next Story