Mon Dec 23 2024 02:13:15 GMT+0000 (Coordinated Universal Time)
బ్యూటీపార్లర్ దెబ్బకి ఆగిపోయిన పెళ్లి.. అసలేం జరిగిందంటే..
ఈ ఘటన కర్ణాటక లోని హసన్ జిల్లాలో జరిగింది. పెళ్లికి అందంగా కనిపించాలని ఓ యువతి బ్యూటీ పార్లర్ కు వెళ్లింది.
ఈ రోజుల్లో ఫంక్షన్ ఏదైనా సరే.. మేకప్ మస్ట్ అన్నట్టుగా ఉంది. ఏదైనా శుభకార్యం, ఫంక్షన్ కు వెళ్లే మగువలు తమ అందానికి, నగల అలంకరణకు, కట్టుకునే చీరకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. వారి అభిరుచికి తగ్గట్టే.. మేక్ ఓవర్ చేసే సంస్థలూ వచ్చాయి. సోషల్ మీడియాలోనూ మేక్ ఓవర్లు బిజినెస్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్రైడల్ మేకప్. అదేనండి పెళ్లికూతురికి వేసే మేకప్. హెయిల్ స్టైల్ నుంచి, శారీ కట్టడం, ముఖానికి సరిపోయే మేకప్ వేయడం.. మొత్తంగా పెళ్లికూతురిని ఆర్టిఫిషియల్ అలంకరణలో అందంగా చూపించడం. అందరూ ఇలాంటివాటినే ఇష్టపడుతున్నారు.
కానీ.. ఓ పెళ్లికూతురి విషయంలో అది కాస్తా రివర్స్ అయింది. బ్యూటీ పార్లర్ చేసిన పనితో ఆ పెళ్లికాస్తా ఆగిపోయింది. ఈ ఘటన కర్ణాటక లోని హసన్ జిల్లాలో జరిగింది. పెళ్లికి అందంగా కనిపించాలని ఓ యువతి బ్యూటీ పార్లర్ కు వెళ్లింది. బ్రైడల్ మేకప్ లో భాగంగా.. ఫౌండేషన్ తర్వాత ఆవిరి పట్టారు ఆ పార్లర్ సిబ్బంది. వారి నిర్లక్ష్యం కారణంగా స్టీమ్ ఎక్కువై.. ఆ వేడికి యువతి ముఖమంతా వాచిపోయి అందవికారంగా తయారయ్యింది. ఆ తర్వాత ముఖం నలుపు రంగులోకి మారి, కళ్లు, బుగ్గలు కూడా వాచిపోయాయి. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. బ్యూటీ పార్లర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెళ్లికూతురిని అలా చూసిన సదరు పెళ్లికొడుకు తనకీ పెళ్లి వద్దంటూ పెళ్లిని రద్దు చేసుకున్నాడు.
Next Story