తెలంగాణ ఎన్నికల వేళ.. కర్ణాటక సర్కార్కు షాకిచ్చిన ఈసీ
Assembly Elections 2023: తెలంగాణలో అనుమతి లేకుండా వార్తాపత్రికల్లో ప్రకటనలు ప్రచురించడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్..
Assembly Elections 2023: తెలంగాణలో అనుమతి లేకుండా వార్తాపత్రికల్లో ప్రకటనలు ప్రచురించడం ద్వారా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వాన్ని బాధ్యులను చేస్తూ ఎన్నికల కమిషన్ (EC) సోమవారం సిద్ధరామయ్య ప్రభుత్వానికి నోటీసులు జారీ చేరీ చేసింది. దీనికి వివరణ, ఇన్ఛార్జ్ కార్యదర్శి క్రమ శిక్షణా చర్యను ఎందుకు ఎదుర్కోకూడదని ప్రశ్నించింది.
MCC కింద అవసరమైన అనుమతి లేకుండా తెలంగాణలో ఎలాంటి ప్రకటనలను ప్రచురించవద్దని కర్ణాటక ప్రభుత్వానికి తెలిపింది. నోటీసుపై స్పందించేందుకు ప్రభుత్వం మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు గడువు ఇచ్చింది.
కర్ణాటక ప్రభుత్వం తెలంగాణలో నవంబర్ 24, 27 మధ్య అనేక వార్తాపత్రికల హైదరాబాద్ ఎడిషన్లలో ప్రకటనలను ప్రచురించిందని పేర్కొంటూ, గత శుక్రవారం ఎన్నికల సంఘానికి సోమవారం బీజేపీ, గత శుక్రవారం బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన తర్వాత ఎన్నికల సంఘం ఈ చర్య తీసుకుంది.
తెలంగాణ ఎన్నికలలో సర్క్యులేషన్స్ ఉన్న వార్తాపత్రికలలో కర్నాటక ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ విజయాలను హైలైట్ చేస్తూ ప్రకటనలు ఇవ్వడం కమిషన్ ఆదేశాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అని నోటీసులో పేర్కొంది.