Sun Dec 29 2024 02:16:28 GMT+0000 (Coordinated Universal Time)
మైనర్లకు కండోమ్ లు, గర్భనిరోధక మాత్రలూ అమ్మొచ్చట
మైనర్లకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై ఎలాంటి నిషేధం విధించలేదని.. వాళ్లు కొనుగోలు చేయకుండా..
ఓ రాష్ట్రంలో మైనర్లకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై నిషేధం విధించారంటూ.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో.. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం వాటిపై క్లారిటీ ఇచ్చింది. ఇటీవల బెంగళూరులోని పలువురు స్కూల్ స్టూడెంట్స్ బ్యాగులలో కండోమ్స్, గర్భనిరోధక మాత్రలు కనిపించిన సంఘటనలు రాష్ట్రంలో వెలుగు చూడటంతో.. రాష్ట్ర ప్రభుత్వం మైనర్లకు కండోమ్స్ అమ్మకాలపై నిషేధం విధించినట్లుగా పలు మీడియా వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి.
తాజాగా.. ఆ వార్తలపై కర్ణాటక ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. మైనర్లకు కండోమ్స్, గర్భనిరోధక మాత్రల అమ్మకాలపై ఎలాంటి నిషేధం విధించలేదని.. వాళ్లు కొనుగోలు చేయకుండా నిరోధించేందుకు ఫార్మసిస్ట్లను కౌన్సిలింగ్ ఇవ్వమని కోరామని కర్ణాటక ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతే తప్ప.. 18 ఏళ్లలోపు వారికి కండోమ్లు, గర్భనిరోధక మాత్రాలు విక్రయించకుండా నిషేధిస్తూ ఫార్మాసిస్ట్లకు ఎలాంటి సర్క్యులర్ను జారీ చేయలేదని కర్ణాటక డ్రగ్స్ కంట్రోల్ విభాగం క్లారిటీ ఇచ్చింది.
"కర్ణాటకలో ఎక్కడా కూడా కండోమ్స్, గర్భనిరోధక మాత్రాలపై ఎలాంటి నిషేధం విధించలేదు. లైంగికంగా సంక్రమించే వ్యాధులను నివారించేందుకు, జనాభా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. అయితే స్కూల్ పిల్లలకు మాత్రం కాదు. 18 ఏళ్లలోపు ఉన్న యువకులకు ఈ మందులు విక్రయించకూడదు అని సర్కులర్లో స్పష్టంగా వివరించాం. వారు వీటిని కొనుగోలు చేయకుండా.. ఫార్మసీలు కౌన్సిలింగ్ ఇవ్వాలని సూచించాం" అని కర్ణాటక డ్రగ్స్ కంట్రోలర్ భాగోజీ టి ఖానాపూరే అన్నారు.
Next Story