Sun Jan 12 2025 13:02:26 GMT+0000 (Coordinated Universal Time)
సుప్రీంకోర్టుకు చేరిన హిజాబ్ వివాదం
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కర్ణాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీంతో హిజాబ్ వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరుకున్నట్లయింది. ఈరోజు ఉదయం హిజాబ్ వివాదం పై కర్ణాటక హైకోర్టు తీర్పు చెప్పిన సంగతి తెలిసిందే.
సవాల్ చేస్తూ....
హిజాబ్ విద్యాసంస్థల్లో తప్పనిసరి కాదని హైకోర్టు పేర్కొంది. విద్యాసంస్థల్లో యూనిఫారంను విధిగా ధరించాలని హైకోర్టు పేర్కొంది. హిజాబ్ అంశం ఇస్లాం మతంలోనూ లేదని పేర్కొంది. కర్నాటక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు హిజాబ్ వివాదం చేరడంతో మరోసారి అందరి దృష్టి ఢిల్లీకి మారింది.
- Tags
- hijab
- high court
Next Story