Fri Nov 22 2024 07:23:40 GMT+0000 (Coordinated Universal Time)
హిజాబ్ పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. విద్యాసంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని హైకోర్టు పేర్కొంది
హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. విద్యాసంస్థల్లో హిజాబ్ తప్పనిసరి కాదని హైకోర్టు పేర్కొంది. హిజాబ్ అంశంపై దాఖలయిన అన్ని పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఇస్లాంలోనూ హిజాబ్ ధరించాలన్న నిబంధన ఏదీ లేదని హైకోర్టు పేర్కొంది. విద్యాసంస్థల్లో యూనిఫారంలు తప్పనిసరిగా ధరించాలని హైకోర్టు పేర్కొంది.
ఎవరైనా పాటించాల్సిందే......
విద్యాసంస్థల ప్రొటోకాల్స్ ను ఎవరైనా పాటించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. హిజాబ్ ను విద్యాసంస్థల్లో అనుమతించాలని కొన్ని, అనుమతించకూడదని మరికొన్ని పిటీషన్లు దాఖలయ్యాయి. అయితే అన్ని పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. యూనిఫారాంను విద్యార్థులు వ్యతిరేకించడానికి వీల్లేదని చెప్పింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో కర్ణాటక అంతటా 144వ సెక్షన్ విధించారు. ఉడిపి జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
- Tags
- hijab
- high court
Next Story