Mon Dec 23 2024 07:57:50 GMT+0000 (Coordinated Universal Time)
ఆదర్శం.. పెళ్లికయ్యే ఖర్చుతో ఏడు కుటుంబాల్లో వెలుగు నింపిన వధువు
కేరళలోని కోజికోడ్ జిల్లా మయపయ్యూర్ కు చెందిన అంత్రు - రంలా దంపతుల కుమార్తె షెహ్నా షెరికి .. కొట్టపల్లికి చెందిన
పెళ్లంటే.. నూరేళ్లపంట అంటారు. అందుకే జీవితాంతం గుర్తుండిపోయేలా పెళ్లి తంతు నిర్వహిస్తారు. ఉన్నోళ్లు.. లేనోళ్లని కాకుండా.. ఎవరి తాహతకు తగ్గట్టుగా వారు పెళ్లిళ్లు చేసుకుంటారు. ఏ పెళ్లిలో అయినా వధువే మెయిన్ ఎట్రాక్షన్. ఏం నగలు వేసుకుంది ? పుట్టింటి వారు.. అత్తింటి వారు ఎంత బంగారం పెట్టారనే ఆరాలు తీస్తారు పెళ్లికొచ్చిన అతిధులు. వధువు కూడా తనకు కావాల్సిన నగలను ఏరికోరి ఎంచుకుని మరీ వేసుకుంటుంది. కానీ ఈ వధువు అందుకు పూర్తిగా భిన్నం. తన పెళ్లి నగలకు అయ్యే ఖర్చుతో ఏడు కుటుంబాల్లో వెలుగు నింపింది.
కేరళలోని కోజికోడ్ జిల్లా మయపయ్యూర్ కు చెందిన అంత్రు - రంలా దంపతుల కుమార్తె షెహ్నా షెరికి .. కొట్టపల్లికి చెందిన మహమ్మద్ షఫీతో పెళ్లి నిశ్చయమైంది. అయితే షెహ్నా తన వివాహాన్ని నిరాడంబరంగా జరుపుకోవాలనుకుంది. పెళ్లికి అయ్యే ఖర్చుతో పేదలకు సహాయం చేయాలనుకుంది. షెహ్నా తీసుకున్న ఈ నిర్ణయాన్ని తల్లిదండ్రులు, వరుడు అంగీకరించడంతో పెళ్లితంతును సాధారణంగా ముగించారు. అనంతరం పెళ్లి వేదికపైనే 21 సెంట్ల భూమిని నాలుగు నిరుపేద కుటుంబాలకు పంపిణీ చేశారు. మరో వ్యక్తికి ఇంటిని నిర్మించి ఇచ్చారు. మరొకరి ఆస్పత్రి చికిత్సకు అయ్యే ఖర్చు, పేద యువతి వివాహ ఖర్చును భరించారు. అలాగే దగ్గర్లోని డయాలసిస్ సెంటర్ కు కూడా విరాళం ఇచ్చారు. ఇలా షెహ్నా తన పెళ్లికి, నగలకు అయ్యే ఖర్చును నియంత్రించుకుని, పలు కుటుంబాల్లో వెలుగును నింపి ఆదర్శంగా నిలిచింది.
Next Story