Mon Dec 23 2024 11:04:37 GMT+0000 (Coordinated Universal Time)
తమ పెళ్లికి భారత సైన్యాన్ని ఆహ్వానించిన కేరళ జంట
ప్రియమైన హీరోలకు.. మీ ధైర్యసాహసాల వల్లే మేమిక్కడ సంతోషంగా జీవిస్తున్నాం.. ఇప్పుడు ఒక్కటవబోతున్నాం.. ఇలాంటి ఆనంద ..
పెళ్లంటే.. రెండు కుటుంబాలు, ఇద్దరు మనుషులు, రెండు మనసులు.. మూడు ముళ్లు, ఏడు అడుగులు, బంధుమిత్రుల ఆశీర్వాదాలు. మనం ఇంత ప్రశాంతంగా ఇవన్నీ చేసుకోవడానికి కారణం మన ఆర్మీ. వాళ్లు సరిహద్దుల్లో కాపలా కాస్తున్నారు కాబట్టే.. మనమింత ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఈ విషయాన్ని గ్రహించిన ఓ జంట.. ఇంతవరకూ ఎవరూ చేయని పని చేసింది. భారత ఆర్మీని తమ వివాహానికి రావాలని కోరుతూ పెండ్లి పత్రిక పంపింది.
'ప్రియమైన హీరోలకు.. మీ ధైర్యసాహసాల వల్లే మేమిక్కడ సంతోషంగా జీవిస్తున్నాం.. ఇప్పుడు ఒక్కటవబోతున్నాం.. ఇలాంటి ఆనంద సమయంలో మీరు మా చెంత ఉండాలి..మీ ప్రేమ, దేశంపై మీకున్న భక్తి, విధినిర్వహణలో మీరు చూపించే సాహసానికి మేమెంతో రుణపడి పోయాం. సరిహద్దుల్లో కాపలా కాస్తూ మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, మా జీవితాలను సంతోషంగా ఉంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు. మా పెళ్లికి హాజరై మమ్మల్ని దీవించండి' అంటూ ఆహ్వాన పత్రికను పంపారు.
ఆ ఆహ్వానాన్ని అందుకున్న ఆర్మీ అధికారులు కూడా.. అంతే సంతోషంగా స్పందించారు. నవంబర్ 10న పెళ్లి చేసుకున్న రాహుల్, కార్తీకలకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తమను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు పోస్ట్ చేసిన పెండ్లి పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నెటిజన్ నేను చూసిన ది బెస్ట్ ఇన్విటేషన్ ఇదేనని కామెంట్ చేశాడు.
Next Story