Fri Mar 28 2025 11:38:58 GMT+0000 (Coordinated Universal Time)
భర్త అంగీకారం లేకపోయినా విడాకులు తీసుకోవచ్చు : కేరళ హై కోర్టు
భర్త అంగీకరించకున్నా కులా విధానాన్ని అమలు చేయవచ్చని కోర్టు ఈ తీర్పులో పేర్కొంది. ఓ కేసులో 59 పేజీల తీర్పును ..

భార్యభర్తలు విడాకులు పొందాలంటే.. పరస్పర అంగీకారం ఉండాల్సిందే. కానీ ఇకపై అలాంటి అవసరం లేదని, భర్త అంగీకారం లేకపోయినా భార్య విడాకులు పొందవచ్చని తీర్పు వెలువరించింది. కానీ ఇది కేవలం ముస్లిం మహిళలకే వర్తిస్తుంది. భర్త నుంచి విడాకులు కావాలని కోరే హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని హైకోర్టు వెల్లడించింది. భర్త అంగీకారం లేకున్నా ఆ మహిళ విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని కోర్టు వెల్లడించింది.
భర్త అంగీకరించకున్నా కులా విధానాన్ని అమలు చేయవచ్చని కోర్టు ఈ తీర్పులో పేర్కొంది. ఓ కేసులో 59 పేజీల తీర్పును ధర్మాసనం వినిపించింది. దానితోపాటు.. విడాకులు పొందే మహిళలకు భర్త భరణం ఇవ్వాలని కోర్టు తెలిపింది. జస్టిస్ మహమ్మద్ ముస్తాక్, జస్టిస్ సీఎస్ డయాస్లతో కూడిన ధర్మాసనం ఓ కేసులో ఈ తీర్పు ఇచ్చింది. ముస్లిం మహిళ ఎప్పుడైనా తన వివాహ బంధాన్ని బ్రేక్ చేయవచ్చని, పవిత్ర ఖురాన్ కూడా ఈ విధానాన్ని అంగీకరిస్తుందని చెప్పింది. భర్త అంగీకారం ఉన్నా, లేకున్నా విడాకులు తీసుకోవచ్చని కోర్టు తెలిపింది.
Next Story