Fri Nov 22 2024 08:32:26 GMT+0000 (Coordinated Universal Time)
హమ్మయ్య.. స్కూల్స్ ఓపెన్ అయ్యాయి
కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే
కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిఫా వైరస్ టెన్షన్ పెట్టిన సంగతి తెలిసిందే..! ఊహించని విధంగా నిఫా వైరస్ వ్యాప్తి చెందడం.. మరణించిన వారిలో నిఫా వైరస్ ఉందని తేలడంతో ప్రజలు భయంతో వణికిపోయారు. దీంతో అధికారులు హుటాహుటిన పలు ఆంక్షలను అమలు చేశారు. చాలా ప్రాంతాల్లో స్కూళ్లను మూసి వేశారు. సమావేశాలు జరగకుండా ఆంక్షలను విధించారు. అయితే గత వారం రోజులలో నిఫా వైరస్ ప్రభావం తగ్గింది.
ప్రస్తుతం అక్కడ కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడంతో విద్యా సంస్థలను తెరవడానికి స్థానిక అధికారులు నిర్ణయించారు. జిల్లాలోని కంటైన్మెంట్ జోన్ల బయట ఉన్న విద్యాసంస్థలు సోమవారం నుంచి సాధారణ కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాయి. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఏ.గీత ఓ ప్రకటలో తెలియజేశారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న పాఠశాలలకు సంబంధించి ఆన్లైన్ తరగతులు నిర్వహించనున్నారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించడం, శానిటైజర్ వాడాలని అధికారులు సూచించారు. నిబంధనలను కఠినంగా అమలు చేయాలని అధికారులు పాఠశాల యాజమాన్యాలకు సూచించారు.
Next Story