Mon Dec 23 2024 05:09:30 GMT+0000 (Coordinated Universal Time)
America : రేసు నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం సంభవించింది. అధ్యక్ష బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు.
అమెరికా అధ్యక్ష పదవి రేసులో కీలక పరిణామం సంభవించింది. అధ్యక్ష బరి నుంచి వివేక్ రామస్వామి తప్పుకున్నారు. తాను పోటీ నుంచి తప్పుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన మద్దతు డొనాల్డ్ ట్రంప్ కేనని ఆయన ప్రకటించారు. అయోవా ప్రైమరీ పోరులో ట్రంప్ కంటే తక్కువ ఓటల్లు సాధించడంతో వివేక్ రామస్వామి ఈ నిర్ణయం తీసుకున్నారు. భారత్ సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవడంతో ట్రంప్ కు మద్దతు మరింత పెరిగిందనే చెప్పాలి.
తక్కువ ఓట్లు రావడంతో...
రిపబ్లికన్ పార్టీ తరుపున వివేక్ రామస్వామి అయోవా కాకసస్ లో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం సమరం జరిగింది. ఈ తొలిపోరులోనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు 51 శాతం ఓటింగ్ రాగా, వివేక్ రామస్వామికి కేవలం 7.7 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఆయన తన ప్రచారాన్ని కూడా నిలిపేస్తున్నట్లు ప్రకటించారు. వివేక్ రామస్వామి బరి నుంచి తప్పుకోవడంతో పరిస్థితులు ట్రంప్ కు అనుకూలంగా మారాయి.
Next Story