Thu Dec 19 2024 03:16:02 GMT+0000 (Coordinated Universal Time)
Manipur : మణిపూర్ అంశంపై నేడు కీలక భేటీ
మణిపూర్ అంశంపై నేడు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నేడు జరగనుంది.
మణిపూర్ అంశంపై నేడు కేంద్ర హోంశాఖ కీలక సమావేశం నేడు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు అన్ని శాఖల అధికారులతో ఈ సమవేశాన్ని నిర్వహించనున్నారు. మణిపూర్ లో జరుగుతున్న తాజా పరిణామాలపై ఈ కీలక సమావేశంలో చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. మణిపూర్ లో ఇంకా హింసలు చెలరేగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది.
ఉన్నతాధికారుల సమావేశంలో...
ఈ నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ అత్యవసరంగా సమావేశమై మణిపూర్ లో హింసాకాండపై చర్చించనుంది. స్థానికులు కూడా పెద్దయెత్తున ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశం అవుతున్నారు. మణిపూర్ లో జరుగుతున్న వరస ఘటనలపై ఈ సమావేశంలో చర్చించి వాటిని అదుపు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు.
Next Story