Mon Dec 23 2024 10:32:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు సుప్రీంలో "సేన" సీన్
మహారాష్ట్ర వివాదంపై నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువడనుంది.
మహారాష్ట్ర వివాదంపై నేడు సుప్రీంకోర్టులో కీలక తీర్పు వెలువడనుంది. దీంతో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, మాజీ ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఉద్ధవ్ ధాక్రే వర్గం వేసిన పిటీషన్‌పై నేడు సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు చెప్పబోతున్న తరుణంలో ఇప్పటి ప్రభుత్వం ఉంటుందా? దిగిపోతుందా? అన్న టెన్షన్ నెలకొంది.
తిరుగుబాటు ఎమ్మెల్యేలపై...
శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన షిండే వర్గం వేరు కుంపటి పెట్టుకుని బీజేపీతో కలసి గత ఏడాది మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. శివసేన కూడా తమదేనని షిండే వర్గం వాదిస్తుంది. అయితే షిండేతో కలిసిన పదిహేను మంది ఎమ్మెల్యేలపై అప్పుడు అనర్హత వేటు వేశారు. దీనిపై ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు చెప్పనుంది. అందుకే రెండు వర్గాల్లోనూ ఈ తీర్పు పట్ల ఆసక్తిగా ఉంది.
Next Story