Sun Dec 22 2024 23:44:55 GMT+0000 (Coordinated Universal Time)
తుపానుగా మారిన వాయుగుండం.. ఏపీకి భారీ వర్షసూచన
అసని తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి..
విశాఖపట్నం : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుపానుగా మారింది. ఈ తుపానుకు వాతావరణశాఖ అసనిగా నామకరణం చేసింది. అసని అంటే సింహళ భాషలో కోపం అని అర్థం. సముద్రంలో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో కదులుతోన్న తుపాను.. ప్రస్తుతం విశాఖకు ఆగ్నేయంగా 970 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. వాయువ్యదిశగా కదులుతోన్న ఈ అసని తుపాను రానున్న 24 గంటల్లో తీవ్రతుపానుగా మారనుందని వెల్లడించారు. మే 10వ తేదీన ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో తుపాను బలహీన పడి తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు.
అసని తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకు 70-90 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. తీరప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని తెలిపారు. నేటి అర్థరాత్రి నుంచి గాలుల తీవ్రత మరింత పెరుగుతుందని తెలిపారు. అర్థరాత్రి నుంచి గంటకు 105 నుంచి 125 కి.మీ వేగంతో గాలులు వీయనున్నాయి. 10వ తేదీ సాయంత్రం నుంచి ఒడిశా తీరప్రాంతం, ఆంధ్ర ప్రదేశ్ లోని ఉత్తర కోస్తా పరిసర ప్రాంతాల మీదుగా అసని ప్రభావం ఉంటుందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని.. మత్స్యకారులు రేపు, ఎల్లుండి వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.
అసని తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో.. ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని, తీరం వెంబడి గంటకుఅసని తుపాను ప్రభావం కోల్ కతా, ఒడిశా రాష్ట్రాలపై కూడా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో.. ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంతాల్లో ఉన్న 7.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధమవుతోంది.
Next Story