Sun Dec 22 2024 18:42:47 GMT+0000 (Coordinated Universal Time)
లాలూ ప్రసాద్ యాదవ్ ను విమానంలో తరలింపు
ప్రస్తుతం లాలు ప్రసాద్ పరిస్థితి నిలకడగా ఉందని.. ఆయన కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని
బీహార్ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అధినేత లాలు ప్రసాద్ యాదవ్ (74) ఆరోగ్యం మరింత క్షీణించింది. పాట్నా ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఢిల్లీకి తరలించే ముందు ఆస్పత్రిలో లాలు యాదవ్‌ను బీహార్ సీఎం నితీష్ కుమార్ పరామర్శించారు.
చికిత్సకు లాలు యాదవ్ స్పందిస్తున్నారని , త్వరలోనే కోలుకుంటారని ఆయన కుమారుడు తేజస్వి యాదవ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం లాలు ప్రసాద్ పరిస్థితి నిలకడగా ఉందని.. ఆయన కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. ఆయనకు అందించాల్సిన వైద్యం గురించి అక్కడి డాక్టర్లకు తెలుసని అందుకే తాము ఢిల్లీకి తరలించినట్లు తేజస్వి యాదవ్ తెలిపారు.
బుధవారం లాలును పాట్నా నుంచి హుటాహుటిన ఎయిర్ అంబులెన్స్‌లో ఢిల్లీకి తరలిస్తున్నారు. పాట్నా ఆస్పత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.ప్రధాని నరేంద్ర మోదీ, లాలూ ఆరోగ్యంపై ఆరా తీశారు. తేజస్వీ యాదవ్‌కు ఫోన్ చేసి ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానితోపాటు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ కూడా తేజస్వికి ఫోన్ చేసి లాలు ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. లాలూ సోమవారం వేకువజామున ఇంట్లో మెట్లపై నుంచి కాలుజారి పడిపోడంతో.. కుడి భుజానికి ఫ్రాక్చర్ అయింది. పాట్నాలోని పరాస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
News Summary - Lalu Prasad Yadav airlifted to Delhi, admitted to AIIMS
Next Story