Fri Nov 22 2024 20:20:01 GMT+0000 (Coordinated Universal Time)
తీవ్ర అస్వస్థతకు గురైన లాలూ ప్రసాద్
శిక్ష ఖరారైన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆయనను రాంచీలోని రాజేంద్ర..
దాణా కుంభకోణం కేసులో దోషిగా పేర్కొంటూ.. నిన్న ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ కు రాంచీ స్పెషల్ సీబీఐ కోర్టు ఐదేళ్లు జైలు శిక్ష, రూ.60 లక్షలు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. శిక్ష ఖరారైన కొద్దిసేపటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు ఆయనను రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(రిమ్స్) లో చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా.. లాలూ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వైద్యులు మాత్రం లాలూ ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్తున్నారు.
1990, 1995 మధ్యకాలంలో డోరాండా ట్రెజరీ నుండి రూ.139.35 కోట్లు రూపాయలు అక్రమంగా విత్డ్రా చేశారని లాలూపై అభియోగాలు నమోదయ్యాయి. లాలూతో పాటు మరో 99 మంది 99 నిందితులపై విచారణ జరిపిన రాంచీలోని సీబీఐ న్యాయస్థానం జనవరి 29న లూలూను దోషిగా తేల్పింది. 25 ఏళ్ల తర్వాత దాణా కుంభకోణంలో లాలూకి శిక్ష పడింది.
Next Story