Fri Dec 20 2024 11:32:55 GMT+0000 (Coordinated Universal Time)
పెరుగుతున్న లంపీ వైరస్ కేసులు.. పాల సరఫరాపై ప్రభావం ?
లంపివైరస్ తో మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా..
కరోనా మన దేశంలోకి ఎంటరై రెండున్నరేళ్లు అవుతోంది. ఇంకా అది పూర్తిగా తొలగిపోకుండానే కొత్తకొత్త వైరస్ లు పుట్టి.. వేగంగా వ్యాపిస్తున్నాయి. కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్, మంకీపాక్స్ పేర్లతో రకరకాల వైరల్ వ్యాధులు వచ్చాయి. మనుషులను పట్టి పీడిస్తోన్న వైరస్ లు.. ఇప్పుడు జంతువులపై ప్రభావం చూపుతున్నాయి. లంపీ వైరస్ అనే వ్యాధితో జంతువులు సతమతమవుతున్నాయి. దేశంలో 10 రాష్ట్రాల్లో ఈ వైరస్ వ్యాపించింది. ముఖ్యంగా రాజస్థాన్ లో దీని ప్రభావం ఎక్కువగా ఉంది.
లంపి వైరస్ కారణంగా రాజస్థాన్ లో 55వేల మూగజీవాలు మృతి చెందాయంటే.. తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. లంపివైరస్ తో మూగజీవాలు అల్లాడిపోతున్నాయి. వైరస్ నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా.. వ్యాధి కారణంగా ప్రాణాలు కోల్పోతున్న పశువుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఆవుల్లో చాలా వరకు లంపి చర్మవ్యాధులు వస్తున్నాయి. ఈ వ్యాధి ఆవులకు వేగంగా సోకి వాటి మరణానికి కారణమవుతోంది. వైరల్ డిసీజ్ కావడంతో.. జంతువులకు వైరస్ త్వరగా వ్యాపిస్తోంది.
ఢిల్లీలోనూ లంపి వైరస్ కేసులు 173 నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇదిలా ఉండగా, లంపి భయంతో రాజస్థాన్, పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో పాల వినియోగం తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పాలు తాగాలన్నా, పాలతో తయారు చేసే వంటకాలు తినాలన్నా భయపడుతున్నారు. లంపి వైరస్ కారణంగా పాల దిగుబడి, వినియోగం తగ్గింది. కొన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా డెయిరీల వద్ద పాలు, నెయ్యి సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Next Story