Sun Dec 22 2024 21:54:58 GMT+0000 (Coordinated Universal Time)
హర్యానాలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 15 మంది గల్లంతు
నూతన సంవత్సరం మొదటిరోజే హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కొండ చరియలు విరిగి పడటంతో
నూతన సంవత్సరం మొదటిరోజే హర్యానాలో విషాద ఘటన చోటుచేసుకుంది. అకస్మాత్తుగా కొండ చరియలు విరిగి పడటంతో అనేక మంది గల్లంతవ్వగా.. డజన్ల కొద్దీ వాహనాలు విధ్వంసమయ్యాయి. భివానీ జిల్లాలోని తోషామ్ బ్లాక్ వద్ద ఉన్న దాదమ్ మైనింగ్ జోన్ లో జరిగిందీ ఘటన. కొండచరియలు విరిగిపడటంతో ఈ ప్రాంతంలో నిర్వహిస్తున్న మైనింగ్ లో పనిచేస్తున్న వారిలో 15 మంది గల్లైంతనట్లు సమాచారం. ఇంకా ఎంతమంది శిథిలాల కింద చిక్కుకున్నారు ? ప్రాణనష్టం జరిగిందా ? అన్న వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story