Mon Dec 23 2024 02:11:29 GMT+0000 (Coordinated Universal Time)
Ayodhya : అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు
అయోధ్య బాల రాముడిని సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు
అయోధ్య బాల రాముడిని సందర్శించేందుకు దేశం నలుమూలల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. దీంతో అయోధ్య రాముడిని దర్శించుకునేందుకు భక్తులకు గంటల సమయం పడుతుంది. భక్తులు గంటల తరబడి క్యూ లైన్లలో నిరీక్షిస్తున్నారు. వరస సెలవులు రావడంతో పాటు అయోధ్య రామాలయంలో రాముడు కొలువు దీరడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు అయోధ్యకు చేరుకుంటుండటంతో వీధులన్నీ కిటకిటలాడుతున్నాయి.
విగ్రహ ప్రతిష్ట తర్వాత...
అయోధ్య రామాలయంలో ఈ నెల 22వ తేదీన బాల రాముడి విగ్రహ ప్రతిష్ట జరిగిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరిగిన తర్వాత లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. దీంతో ఆలయ దర్శన వేళలను కూడా మార్చాల్సి వచ్చింది. ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకూ దర్శనాలను పొడిగిస్తూ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. అయోధ్యలో వసతి గృహాలు కూడా దొరకక పోవడం, చలి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
Next Story