Mon Dec 23 2024 13:21:21 GMT+0000 (Coordinated Universal Time)
సాఫ్ట్వేర్ ఉద్యోగాలు షుష్కాకి
సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాల తొలగింపు ఇంకా కొనసాగుతుంది. పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
సాఫ్ట్వేర్ కంపెనీలలో ఉద్యోగాల తొలగింపు ఇంకా కొనసాగుతుంది. పెద్ద పెద్ద సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం దృష్ట్యా ఉద్యోగుల జీతభత్యాలను భరించలేక పోతున్నామని అనేక కంపెనీలు లేఆఫ్ లు ప్రకటిస్తున్నాయి. అమెజాన్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకూ ఏదీ ఇందుకు మినహాయింపు కాదు. అధిక జీతాలు పొందుతున్న వారిని ముందుగా ఉద్యోగాల నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం.
రెండు వేల ఉద్యోగాలు...
తాజాగా పేపాల్ కంపెనీ రెండు వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఏడు శాతం మంది ఉద్యోగులపై లేఆఫ్ ప్రభావం ఉండనున్నట్లు తెలిపింది. అనేక సంస్థలు ఇప్పటికే కార్యాలయాలు మూసివేశాయి అదనపు ఖర్చును తగ్గించుకున్నాయి. మరికొన్ని సంస్థలు కూడా లే ఆఫ్ బాట పట్టనున్నాయని చెబుతున్నారు. పేపాల్ స్టాక్ దెబ్బతినడంతో ఉద్యోగులను తొలగించే ప్రక్రియను ప్రారంభించనట్లు సంబందిత అధికారులు తెలిపారు.
Next Story