Sun Dec 22 2024 13:47:44 GMT+0000 (Coordinated Universal Time)
Rahul Gandhi : విపక్షాల గొంతు నొక్కేయవద్దు.. అందరికీ అవకాశమివ్వండి
లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయిన ఓంబిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు
లోక్ సభ స్పీకర్ గా ఎన్నికయిన ఓంబిర్లాను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందించారు. సభలో ప్రజాసమస్యలు ప్రతిబింబించేలా అవకాశం ఇవ్వాలని కోరారు. ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించేందుకు విపక్షాలకు సరైన సమయం కేటాయించాలని కోరారు. అప్పుడే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు.
ప్రజా సమస్యలను...
విపక్షాల గొంతు నొక్కేస్తే సభను సజావుగా నడిపించినట్లు కాదని ఆయనఅన్నారు. అందరు సభ్యులను సమానంగా, పక్షపాతం లేకుండా చూడాలని కోరుకుంటున్నానని తెలిపారు. విపక్షాలు సలహాలు, సూచనలను ప్రభుత్వం తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజల గొంతుకఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యమని తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఆకాంక్షలు ఎలా వ్యక్తమయ్యాయో అందరికీ తెలుసునని ఆయన స్పీకర్ ఓంబిర్లా కు సూచించారు.
Next Story