Mon Dec 23 2024 04:53:16 GMT+0000 (Coordinated Universal Time)
ఎల్ఐసీలో ఉద్యోగాలు రెడీ
ఎల్ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రచురితమయింది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది
ఎల్ఐసీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రచురితమయింది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టుల కోసం ఎల్ఐసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 300 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కోసం ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు తర్వాత ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.
విద్యార్హత...
ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ మధ్య ప్రిలిమనరీ ఎగ్జామినేషన్ ఉండే అవకాశముంది. ఏదైనా డిగ్రీని ఈ పోస్టుల కోసం విద్యార్హతగా నిర్ణయించారు. అభ్యర్థుల వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలని నోటిఫికేషన్ పేర్కొన్నారు. ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 31గా నిర్ణయించారు. licindia.in సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- Tags
- lic
- otification
Next Story