Mon Dec 23 2024 13:33:50 GMT+0000 (Coordinated Universal Time)
ప్లాట్ ఫామ్ పైకి దూసుకొచ్చిన రైలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
చెన్నై బీచ్ స్టేషన్ నుంచి తాంబరానికి వెళ్లే ఓ విద్యుత్ రైలు యార్డ్ నుంచి బీచ్ స్టేషన్ కు ఆదివారం సాయంత్రం 4.25 గంటలకు..
చెన్నై : ప్రమాదవశాత్తు ఓ విద్యుత్ రైలు ప్లాట్ ఫామ్ పైకి దూసుకురావడంతో.. అక్కడున్న ప్రయాణికులు పరుగులు తీశారు. ఈ ఘటన చెన్నైలోని బీచ్ స్టేషన్ లో జరుగింది. యార్డు నుంచి వచ్చిన విద్యుత్ రైలు అదుపుతప్పి ప్లాట్ ఫామ్ అడ్డుగోడను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రైలులోని రెండు బోగీలు ధ్వంసమయ్యాయి. ప్లాట్ ఫామ్ పై ఉన్న దుకాణాలు కూడా దెబ్బతిన్నాయి.
చెన్నై బీచ్ స్టేషన్ నుంచి తాంబరానికి వెళ్లే ఓ విద్యుత్ రైలు యార్డ్ నుంచి బీచ్ స్టేషన్ కు ఆదివారం సాయంత్రం 4.25 గంటలకు బయల్దేరింది. ఆ రైలు ఒకటో నెంబర్ ఫ్లాట్ఫామ్పైకి వస్తూ అదుపుతప్పి అడ్డుగోడ దాటి దుకాణాలను ఢీకొని ఆగింది. ఆ రైలులో ప్రయాణికులెవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమయంలో రైలు నడుపుతున్న లోకోపైలట్ శంకర్ చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు.
ఈ ప్రమాదంలో రైలు ముందువైపు రెండు బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న రైల్వే అధికారులు, ఇంజనీరింగ్ సిబ్బంది హుటాహుటిన బీచ్ స్టేషన్ కు వెళ్లి, రైలింజన్, బోగీలను తొలగించే పనులు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఒకటో నెంబర్ ఫ్లాట్ఫామ్ మీదుగా వెళ్లాల్సిన రైళ్లను మరో ఫ్లాట్ఫామ్ మీదుగా నడుపుతున్నారు.
Next Story