Tue Nov 05 2024 19:40:01 GMT+0000 (Coordinated Universal Time)
సదరన్ రైల్వే కీలక నిర్ణయం.. ఇకపై వారికి మాత్రమే రైలు టికెట్లు !
వారంరోజుల్లోనే కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో సదరన్
దేశంలో థర్డ్ వేవ్ మొదలైంది. కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కేవలం ఈ వారంరోజుల్లోనే కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా పెరిగిపోయాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఆంక్షల వలయంలోకి వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో సదరన్ రైల్వే కూడా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ ను అరికట్టే క్రమంలో భాగంగా.. ఇకపై రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకున్న వారికి మాత్రమే చెన్నై లోకల్ ట్రైన్స్ లో ప్రయాణించేందుకు టికెట్లు ఇస్తామని ప్రకటించింది. జనవరి 10వ తేదీ నుంచి 31వ తేదీ వరకూ ఈ నిబంధన అమల్లో ఉంటుందని తెలిపింది.
రెండు డోసుల వ్యాక్సిన్లు తీసుకోని ప్రయాణికులకు ఎట్టిపరిస్థితుల్లోనూ టికెట్లు జారీచేయబడవని స్పష్టం చేసింది. టికెట్ కొనుగోలు చేసే సమయంలో ప్రయాణికులు వ్యాక్సినేషన్ పూర్తయినట్టు సర్టిఫికెట్ చూపించాల్సి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ఈ నిబంధనలో ఎలాంటి సడలింపులు ఉండబోవని, సీజన్ టికెట్ తీసుకునేవారికి కూడా ఇది వర్తిస్తుందని పేర్కొంది. అలాగే మొబైల్ ఫోన్లలో జనవరి 10 నుంచి 31వ తేదీ వరకూ అన్ రిజర్వ్ డ్ టికెటింగ్ సిస్టమ్ అందుబాటులో ఉండదని వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని గ్రహించి, సహకరించాలని సదరన్ రైల్వే విజ్ఞప్తి చేసింది.
Next Story