Fri Nov 22 2024 13:32:08 GMT+0000 (Coordinated Universal Time)
Amit Shah: అమిత్ షా విజయం
గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ
గుజరాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా విజయం సాధించారు. గుజరాత్లోని గాంధీనగర్లో అమిత్ షా తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి సోనాల్ రమణ్భాయ్పై 3.7లక్షల పైచిలుకు మెజార్టీతో గెలుపొందారు. 2019 ఎన్నికల్లో షా 5.57 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు. గతంలో బీజేపీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ ఈ స్థానం నుండి ప్రాతినిధ్యం వహించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ సిట్టింగ్ సీటు కేరళలోని వయనాడ్ తో పాటు ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీ నుంచి కూడా పోటీ చేశారు. ఫలితాలలో ఆయన రెండు చోట్లా లీడ్ లో కొనసాగుతున్నారు. వయనాడ్, రాయ్ బరేలీలో తన సమీప ప్రత్యర్థుల కన్నా లక్ష పైచిలుకు ఓట్లతో దూసుకుపోతున్నారు. వయనాడ్ లో సీపీఐ నేత అన్నె రాజా కన్నా 1,86,265 ఓట్లతో ముందంజలో ఉండగా.. రాయ్ బరేలీలో బీఎస్పీ నేత ఠాకూర్ ప్రసాద్ కన్నా 1,24,629 ఓట్లతో లీడ్ లో ఉన్నారు.
Next Story