Sun Dec 22 2024 16:23:35 GMT+0000 (Coordinated Universal Time)
రాహుల్ గాంధీకి నోటీసులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లోక్ సభ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15వ లోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి లోక్ సభ సెక్రటేరియట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నోటీసులు జారీ అయ్యాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి, బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే సభాహక్కుల ఉల్లంఘన నోటీసులకు సమాధానమివ్వాలని కోరింది.
మోదీపై చేసిన...
రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంపై లోక్సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసగంలో అదానీ అంశంపై మాట్లాడిన రాహుల్ గాంధీ మోదీపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. అదానీ, మోదీ కలసి ఉన్న కొన్ని ఫొటోలను కూడా సభలో చూపడంపై అభ్యంతరం వ్యక్తమయింది.
Next Story