Tue Dec 24 2024 05:05:06 GMT+0000 (Coordinated Universal Time)
Breaking: రాహుల్.. మీరు బంగళా ఖాళీ చేయండి
రాహుల్ గాంధీకి లోక్సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఉంటున్న బంగళాను ఖాళీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాహుల్ గాంధీకి లోక్సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. ఉంటున్న బంగళాను ఖాళీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. పార్లమెంటు సభ్యుడిగా అనర్హత వేటు పడటంతో రాహుల్ గాంధీ ఉంటున్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని తెలిపింది. ఢిల్లీలోని తుగ్లక్ రోడ్డులోని పన్నెండో నెంబరు ఇంటిని రాహుల్ ఖాళీ చేయాలని కోరింది.
ఏప్రిల్ 22వ తేదీలోగా...
ఏప్రిల్ 22వ తేదీలోగా ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని లోక్సభ హౌసింగ్ ప్యానెల్ నోటీసులు జారీ చేసింది. అదే చివరి తేదీ అని పేర్కొంది. 2019లో కర్ణాటకలో మోదీపై చేసిన వ్యాఖ్యలపై పరువు నష్టం దావా కేసులో రెండేళ్ల జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలు వచ్చిన 24 గంటలకే ఆయనపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో ఆయన ఉంటున్న ప్రభుత్వ బంగళాను ఖాళీ చేయాలని కోరింది.
Next Story