శ్రీకృష్ణుడితో కుమార్తెకు వివాహం చేసిన తండ్రి.. ఎంతో గ్రాండ్ గా..!
అనారోగ్యంతో మంచం పట్టిన తన కుమార్తె కోరికను తీర్చడానికి, ఒక తండ్రి ఆమెకు శ్రీకృష్ణుడితో వివాహం జరిపించాడు. గ్వాలియర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పెళ్లికి బంధుమిత్రులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. శివపాల్ అనే వ్యాపారవేత్తకు దివ్యాంగురాలైన కుమార్తె ఉంది. ఆమె మాట్లాడలేదు, చెవులు వినబడవు. 21 ఏళ్లుగా చక్రాల కుర్చీకే పరిమితమైన కుమార్తెను శివపాల్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. కుమార్తెకు వివాహం జరగదని నిర్ణయించుకున్న ఆయన తన కుమార్తెను శ్రీకృష్ణ భగవానుడికి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాడు. కుమార్తెకు వివాహం నిశ్చయించామని, తప్పకుండా రావాలంటూ బంధుమిత్రులకు కబురు పంపాడు. పెళ్లికి ముందు మామూలుగానే మెహందీ వేడుక, విందు, ఊరేగింపు నిర్వహించారు. ఓ ఆలయంలో జరిగిన ఈ పెళ్లిలో శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న అమ్మాయి, వధువు పూలదండలు మార్చుకున్నారు. పెళ్లికి హాజరైన బంధుమిత్రులు వారిని ఆహ్వానించారు.